Thursday, November 25, 2010

వచ్చే వేసవికి 'వీర'

రవితేజ హీరోగా 'రైడ్' ఫేమ్ రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వీర'. సాన్వి ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. 'వీర' రెగ్యులర్ షూటింగ్ బుధవారం ఉదయం మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. గణేష్ ఇందుకూరి మాట్లాడుతూ "రవితేజ కెరీర్‌లో ఇంతకుముందు చెయ్యని వైవిధ్యమైన పాత్రని 'వీర'లో చేస్తున్నారు. సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉన్న ఈ కథను చాలా లావిష్‌గా తెరకెక్కిస్తున్నాం. భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న 'వీర' ఏకధాటిగా మార్చి వరకు జరిగే షెడ్యూల్‌తో పూర్తవుతుంది. ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేస్తాం. రవితేజ సరసన తొలిసారిగా కాజల్, తాప్సీ నటిస్తున్నారు. 'కిక్' శ్యామ్ సరసన శ్రీదేవి నటిస్తుంది. ప్రకాష్‌రాజ్, రోజా, నాగబాబుతో పాటు పలువురు కీలక పాత్రల్లో కనిపిస్తారు'' అని చెప్పారు.
బ్రహ్మానందం, అలీ, ప్రదీప్‌రావత్, రాహుల్‌దేవ్, సుప్రీత్, చలపతిరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, భరత్, వేణుమాధవ్, మాస్టర్ భరత్ కీలక పాత్రధారులు. కెమెరా: ఛోటా.కె.నాయుడు, సంగీతం: థమన్ ఎస్., రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: నారాయణరెడ్డి, నిర్మాత: గణేష్ ఇందుకూరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌వర్మ

No comments:

Post a Comment