Thursday, November 25, 2010

నారా రోహిత్‌ని డైరెక్ట్ చేయనున్న పరశురాం

'బాణం' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నారా రోహిత్ మరో చిత్రంలో నటించనున్నారు. 'యువత', 'ఆంజనేయులు' వంటి చిత్రాలను రూపొందించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఎస్వీకె సినిమా పతాకంపై వైజాగ్‌కు చెందిన పారిశ్రామికవేత్త వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "ఓ మంచి సినిమాతో ఈ రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. పరశురామ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా పరశురామ్, రోహిత్ కెరీర్‌లతో పాటు నా కెరీర్‌లోనూ మైలురాయిగా నిలిచిపోతుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం'' అని అన్నారు.
కెమెరా: శ్రీకాంత్, సంగీతం: తమన్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురామ్.

No comments:

Post a Comment