మహేష్, అనుష్క జంటగా త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'మహేష్ ఖలేజా'. ఎస్.సత్యరామమూర్తి సమర్పించారు. శింగనమల రమేష్‌బాబు, సి.కల్యాణ్ నిర్మాతలు. కనకరత్న మూవీస్ పతాకంపై నిర్మించారు.
ఈ నెల 25కి ఈ సినిమా 50 రోజుల్ని పూర్తి చేసుకుంటుంది. నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్ మాట్లాడుతూ "విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్‌తో 50 రోజుల్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. సినిమాలో మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్ హైలైట్ అని ప్రేక్షకులంతా ప్రశంసించారు. ఓవర్సీస్‌లో ఏ తెలుగు చిత్రానికీ రాని అద్భుతమైన షేర్స్ 'మహేష్ ఖలేజా'కు రావడం విశేషం'' అని అన్నారు.
No comments:
Post a Comment