నిఖిల్ కథానాయకుడిగా చంద్రమహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆలస్యం.. అమృతం'. డాక్టర్.డి.రామానాయుడు నిర్మిస్తున్నారు. మదాలస నాయిక. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ "మంచి కథతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కానుంది. 30 రోజుల్లో తీశాం. ఆలస్యంగా వచ్చిన ఓ రైలు వల్ల ఒక జంట జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ప్రధాన ఇతివృత్తం. దర్శకుడు గొప్పగా తీర్చిదిద్దాడు. ప్రేక్షకులను రంజింపజేస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది'' అని చెప్పారు.
"పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల వారిని తప్పకుండా అలరిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది'' అని నిఖిల్ అన్నారు. దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ "రామానాయుడుగారిని స్ఫూర్తిగా తీసుకుని అంకితభావంతో పనిచేశాం. ఈ సినిమా బఫే మీల్స్ లాంటిది. ఎవరికి ఏది కావాలంటే అది ఉంటుంది. ఖర్చుకు వెనకాడకుండా నాయుడుగారు డీఏ చేయిస్తున్నారు. చిన్న సినిమానే అయినా పెద్ద సినిమాలా ఖర్చు పెడుతున్నారు. కథ, చెప్పిన తీరు కొత్తగా ఉంటాయి'' అని తెలిపారు. మంచి పాటలు రాసే అవకాశం కలిగిందని రామజోగయ్యశాస్త్రి, కేదార్‌నాథ్ అన్నారు.
No comments:
Post a Comment