Thursday, November 25, 2010

కృష్ణుడు 'రామదండు' లోగో ఆవిష్కరణ

కృష్ణుడు ప్రధాన పాత్రధారిగా సతీశ్ వేగేశ్న రూపొందిస్తున్న చిత్రానికి 'రామదండు' అనే పేరు ఖరారు చేశారు. నవ చిత్రాలయ క్రియేషన్స్ పతాకంపై బండి రాధికా నారాయణరావు, బండి రత్నకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో నరేశ్ 'రామదండు' లోగోని ఆవిష్కరించగా, రామదండు డాట్ కామ్ వైబ్‌సైట్‌ని కృష్ణుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ "సతీశ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా 'దొంగ ల బండి'లో నటించా. 'రామదండు' కథ నాకు తెలుసు.
ఫుల్‌బాల్ ఆట నేపథ్యంలో పిల్లలు ప్రధాన పాత్రధారులుగా చేసిన సినిమా'' అని చెప్పారు. ఇది చక్కని ఇతివృత్తంతో చేసిన మంచి సినిమా అని కృష్ణుడు తెలిపారు. ఊరి ప్రెసిడెంట్‌గా మంచి పాత్ర చేశానని కృష్ణభగవాన్ చెప్పగా, మోతుబరి పాత్రను చేశానని అజయ్‌ఘోష్ తెలిపారు.
దర్శకుడు సతీశ్ మాట్లాడుతూ "ప్రతిభావంతుల్ని గెలిపిస్తే దేశాన్ని వాళ్లు గెలిపిస్తారనేది ఇందులోని ప్రధానాంశం. 35 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. రాజమండ్రి, కాకినాడకు వెళ్లి నిజమైన ఆటగాళ్లనే ఈ సినిమాలోని పాత్రలకు ఎంపిక చేసుకున్నాం'' అని చెప్పారు.
కార్యక్రమంలో నటుడు శ్రీరామ్, సంగీత దర్శకుడు శ్రీవసంత్, నిర్మాతలు బండి నారాయణరావు, రత్నకుమార్ మాట్లాడారు. ఎమ్మెస్ నారాయణ, కొండవలస, మాస్టర్ భరత్, పృథ్వీ, సౌమ్య, కల్యాణి, ద్రాక్షారామం సరోజ, ఝాన్సీ, తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: వనమాలి, అభినయ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: శరత్, కూర్పు: బస్వా పైడిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న.

No comments:

Post a Comment