Wednesday, December 1, 2010

B. Nagi Reddy Filmography


B. Nagi Reddy (Producer)
Shavukaru (1950)
Patala Bhairavi (1951)
Pelli Chesi Choodu (1952)
Chandraharam (1954)
Missamma (1955)
Maya Bazaar (1957)
Appu Chesi Pappu Koodu (1958)
Rechukka Pragatichukka (1959)
Manithan Maravillai (1962) (Tamil)
Gundamma Katha (1962)
Satya Harischandra (1965)
CID (1965)
Enga Veettu Pillai (1966) (Tamil)
Ram Aur Shyam (1967) (Hindi)
Nam Nadu (1969) (Tamil)
Ghar Ghar Ki Kahani (1970) (Hindi)
Ganga Manga (1973)
Julie (1975) (Hindi)
Shri Rajeshwari Vilas Coffee Club (1976)
Yehi Hai Zindagi (1977) (Hindi)
Swarg Narak (1978) (Hindi)
Swayamvar (1980) (Hindi)
Shriman Shrimati (1982) (Hindi)
Brindavanam (1993)
Karappu Vellai (1993) (Tamil)
Uzhaipali (1994) (Tamil)
Bhairava Dweepam (1995)
Nammavar (1995) (Tamil)
Sri Krishnarjuna Vijayam (1996)

Thursday, November 25, 2010

'కత్తి కాంతారావు' ఆడియో విడుదల

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కత్తి కాంతారావు'. ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు. బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, ఈదర రవికుమార్, ఈడ్పుగంటి సుబ్రహ్మణ్యేశ్వరరావు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించారు. అంబికా కృష్ణ, కె.ఎల్.నారాయణ అందుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ "హీరోలు, నిర్మాతల కొడుకులే కాదు.. దర్శకుల వారసులు కూడా హీరోలుగా నిలబడుతారని నరేష్ నిరూపించాడు. ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ మాలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించే దర్శకుడు ఈవీవీ. వీరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా విజయవంతం కావాలి'' అని అన్నారు. 
ఈవీవీ మాట్లాడుతూ "ఆద్యంతం నవ్వులు పండించే సినిమా ఇది. 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు' తరహాలో ఈ సినిమా కూడా వినోదాత్మకంగా ఉంటుంది. మలి సగంలో కోట పాత్ర అద్భుతంగా ఉంటుంది. కథాగమనానికి ఎంతగానో దోహదపడుతుంది'' అని అన్నారు. "మల్లికార్జున్ అందించిన బాణీలు అలరిస్తాయి. ఈవీవీ, నరేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నవ్వుల విందు అవుతుంద''ని నిర్మాతలు చెప్పారు.
నరేష్ నటించిన 36 సినిమాలను చూశానని తరుణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్, కోట శ్రీనివాసరావు, నాని, తనీష్, కృష్ణభగవాన్, నిఖిల్, శర్వానంద్, ఆర్పీ పట్నాయక్, జీవా, కొండవలస, ఎల్బీ శ్రీరామ్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌వీవీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

డిసెంబర్ 3న రానున్న 'ఆలస్యం అమృతం'

నిఖిల్ కథానాయకుడిగా చంద్రమహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆలస్యం.. అమృతం'. డాక్టర్.డి.రామానాయుడు నిర్మిస్తున్నారు. మదాలస నాయిక. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ "మంచి కథతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కానుంది. 30 రోజుల్లో తీశాం. ఆలస్యంగా వచ్చిన ఓ రైలు వల్ల ఒక జంట జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ప్రధాన ఇతివృత్తం. దర్శకుడు గొప్పగా తీర్చిదిద్దాడు. ప్రేక్షకులను రంజింపజేస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది'' అని చెప్పారు. 
"పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల వారిని తప్పకుండా అలరిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది'' అని నిఖిల్ అన్నారు. దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ "రామానాయుడుగారిని స్ఫూర్తిగా తీసుకుని అంకితభావంతో పనిచేశాం. ఈ సినిమా బఫే మీల్స్ లాంటిది. ఎవరికి ఏది కావాలంటే అది ఉంటుంది. ఖర్చుకు వెనకాడకుండా నాయుడుగారు డీఏ చేయిస్తున్నారు. చిన్న సినిమానే అయినా పెద్ద సినిమాలా ఖర్చు పెడుతున్నారు. కథ, చెప్పిన తీరు కొత్తగా ఉంటాయి'' అని తెలిపారు. మంచి పాటలు రాసే అవకాశం కలిగిందని రామజోగయ్యశాస్త్రి, కేదార్‌నాథ్ అన్నారు.

నారా రోహిత్‌ని డైరెక్ట్ చేయనున్న పరశురాం

'బాణం' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నారా రోహిత్ మరో చిత్రంలో నటించనున్నారు. 'యువత', 'ఆంజనేయులు' వంటి చిత్రాలను రూపొందించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఎస్వీకె సినిమా పతాకంపై వైజాగ్‌కు చెందిన పారిశ్రామికవేత్త వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "ఓ మంచి సినిమాతో ఈ రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. పరశురామ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా పరశురామ్, రోహిత్ కెరీర్‌లతో పాటు నా కెరీర్‌లోనూ మైలురాయిగా నిలిచిపోతుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం'' అని అన్నారు.
కెమెరా: శ్రీకాంత్, సంగీతం: తమన్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పరశురామ్.

50 రోజుల 'మహేశ్ ఖలేజా'

మహేష్, అనుష్క జంటగా త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'మహేష్ ఖలేజా'. ఎస్.సత్యరామమూర్తి సమర్పించారు. శింగనమల రమేష్‌బాబు, సి.కల్యాణ్ నిర్మాతలు. కనకరత్న మూవీస్ పతాకంపై నిర్మించారు.
ఈ నెల 25కి ఈ సినిమా 50 రోజుల్ని పూర్తి చేసుకుంటుంది. నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్ మాట్లాడుతూ "విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్‌తో 50 రోజుల్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. సినిమాలో మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్ హైలైట్ అని ప్రేక్షకులంతా ప్రశంసించారు. ఓవర్సీస్‌లో ఏ తెలుగు చిత్రానికీ రాని అద్భుతమైన షేర్స్ 'మహేష్ ఖలేజా'కు రావడం విశేషం'' అని అన్నారు.

కృష్ణుడు 'రామదండు' లోగో ఆవిష్కరణ

కృష్ణుడు ప్రధాన పాత్రధారిగా సతీశ్ వేగేశ్న రూపొందిస్తున్న చిత్రానికి 'రామదండు' అనే పేరు ఖరారు చేశారు. నవ చిత్రాలయ క్రియేషన్స్ పతాకంపై బండి రాధికా నారాయణరావు, బండి రత్నకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో నరేశ్ 'రామదండు' లోగోని ఆవిష్కరించగా, రామదండు డాట్ కామ్ వైబ్‌సైట్‌ని కృష్ణుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ "సతీశ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా 'దొంగ ల బండి'లో నటించా. 'రామదండు' కథ నాకు తెలుసు.
ఫుల్‌బాల్ ఆట నేపథ్యంలో పిల్లలు ప్రధాన పాత్రధారులుగా చేసిన సినిమా'' అని చెప్పారు. ఇది చక్కని ఇతివృత్తంతో చేసిన మంచి సినిమా అని కృష్ణుడు తెలిపారు. ఊరి ప్రెసిడెంట్‌గా మంచి పాత్ర చేశానని కృష్ణభగవాన్ చెప్పగా, మోతుబరి పాత్రను చేశానని అజయ్‌ఘోష్ తెలిపారు.
దర్శకుడు సతీశ్ మాట్లాడుతూ "ప్రతిభావంతుల్ని గెలిపిస్తే దేశాన్ని వాళ్లు గెలిపిస్తారనేది ఇందులోని ప్రధానాంశం. 35 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. రాజమండ్రి, కాకినాడకు వెళ్లి నిజమైన ఆటగాళ్లనే ఈ సినిమాలోని పాత్రలకు ఎంపిక చేసుకున్నాం'' అని చెప్పారు.
కార్యక్రమంలో నటుడు శ్రీరామ్, సంగీత దర్శకుడు శ్రీవసంత్, నిర్మాతలు బండి నారాయణరావు, రత్నకుమార్ మాట్లాడారు. ఎమ్మెస్ నారాయణ, కొండవలస, మాస్టర్ భరత్, పృథ్వీ, సౌమ్య, కల్యాణి, ద్రాక్షారామం సరోజ, ఝాన్సీ, తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: వనమాలి, అభినయ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: శరత్, కూర్పు: బస్వా పైడిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న.

వచ్చే వేసవికి 'వీర'

రవితేజ హీరోగా 'రైడ్' ఫేమ్ రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వీర'. సాన్వి ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. 'వీర' రెగ్యులర్ షూటింగ్ బుధవారం ఉదయం మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. గణేష్ ఇందుకూరి మాట్లాడుతూ "రవితేజ కెరీర్‌లో ఇంతకుముందు చెయ్యని వైవిధ్యమైన పాత్రని 'వీర'లో చేస్తున్నారు. సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉన్న ఈ కథను చాలా లావిష్‌గా తెరకెక్కిస్తున్నాం. భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న 'వీర' ఏకధాటిగా మార్చి వరకు జరిగే షెడ్యూల్‌తో పూర్తవుతుంది. ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేస్తాం. రవితేజ సరసన తొలిసారిగా కాజల్, తాప్సీ నటిస్తున్నారు. 'కిక్' శ్యామ్ సరసన శ్రీదేవి నటిస్తుంది. ప్రకాష్‌రాజ్, రోజా, నాగబాబుతో పాటు పలువురు కీలక పాత్రల్లో కనిపిస్తారు'' అని చెప్పారు.
బ్రహ్మానందం, అలీ, ప్రదీప్‌రావత్, రాహుల్‌దేవ్, సుప్రీత్, చలపతిరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, భరత్, వేణుమాధవ్, మాస్టర్ భరత్ కీలక పాత్రధారులు. కెమెరా: ఛోటా.కె.నాయుడు, సంగీతం: థమన్ ఎస్., రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: నారాయణరెడ్డి, నిర్మాత: గణేష్ ఇందుకూరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌వర్మ